telugu cristain songs Lyrics - latest crestain songs in telugu
| Singer | latest crestain songs in telugu |
| Composer | good crestain paatalu telugu |
| Music | crestain song for crestain s telugu |
| Song Writer |
Lyrics
yepati dhananaya song lyrics ( telugu )
ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు
నా దోషము భరియించి – నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి ||
1) కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు – నన్నాదరించావు
అందరు నను విడచిన – నను విడువని యేసయ్యా
విడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా || ప్రేమించే ||
2) నీ ప్రేమను మరువలేనయ్య – నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను – ప్రకటింతును బ్రతుకంతా
నేనొందిన ఈ జయము – నీవిచ్చినదేనయ్య
నీవిచ్చిన జీవముకై – స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||
0 Comments