antaha ni meluke song lyrics in telugu crestain songs||అంతా ని మేలుకే సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు cretsain తెలుగు

 

Antha ni meluke telugu song lyrics in telugu Lyrics - telugu song lyrics


Antha ni meluke telugu song lyrics in telugu
Singer telugu song lyrics
Composer latest telugu crestain songs
Music amzing song lyrics in tleugu
Song Writerbest song lyrics

Lyrics

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)

అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను

కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)       ||అంతా||

ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2)       ||అంతా||

అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2)       ||అంతా||

ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2)       ||అంతా||

చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు (2)       ||అంతా||

సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము – నేను పొందాలని (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2)       ||అంతా||

నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2)       ||అంతా||0



Antha ni meluke telugu song lyrics in telugu Watch Video

Post a Comment

0 Comments