పగిలిన పెదవులకు మంచి చిట్కా
చలికాలం లో చాలామందిని వేదించే సమస్య పొడిబారిన లేదా పగిలిన పెదవులు ,అయితే ఏ పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతువునటాయి . కొన్ని సార్లు అయితే చాలా మండుతూ రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని ఎలా నివారించు కోవాలో అది కూడా మన వంట గదిలో దొరికే సామాగ్రి తో ఎలా నయం చేయాలో చూద్దాం.
నిమ్మరసం మరియు శెనగపిండి
మన వంటగదిలో దొరికే నిమ్మరసం మరియు శెనగపిండి ని ఉపయోగించి ఎలా పొడి పెడవులను ఎలా నయం చేయాలో చూద్దాం ,అయితే దీనికోసం మీరు ఒక చెంచాడు శెనగపిండి ని మరియు ఒక చెంచాడు నిమ్మరసాన్ని ఒక గిన్ని లో తీసుకొని బాగా కలుపుకోండి . ఆ మిశ్రమాన్ని పెదవుల పైన పూసి బాగా రుద్దండి ,అయితే మరి గట్టిగా కాకుండా కొంచం మృదువుగా రుద్దండి ఎందుకంటే పెదవులు అనేవి చాలా సున్నితం గా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా రుద్దకూడదు . ఇలా ఒక 5 నిమిషాలు పాటు చేసినట్లయితే మీ పెదవులు అనేవి ఎర్రగా మరియు మృదువుగా మారతాయి .
తేనె మరియు నిమ్మరసం
అలాగే ఒక spoon తేనె మరియు నిమ్మరసాన్ని కూడా మీరు వాడవచ్చు . దీనిన్ రాత్రి పడుకొనే సమయాల్లో తీసుకొన్నట్లయితే చాలా మంచి పాలితాలను ఇస్తుంది.
పాలనుంచి తీసిన వెన్న
మన అందిరి ఇంట్లో ను వెన్న అనేది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ,మీ వంటగది లో వెన్న ఉన్నట్లు అయితే కొంచం వెన్నాను చిటికిన వెళుతో తీసుకొని మీ పెదవులకు మృదువుగా రుద్దండి ఇలా చేసిన మీ పెదవులు పగలటం తగ్గుతుంది . వేడి పాలనుంచి తీసిన పాల మిగడను కూడా మీరు వాడుకోవచ్చు . ఇది కూడా బాగా పని చేస్తుంది .
కొబ్బరినూనె
ఈ కొబ్బరినూనె గురించి మీకు అస్సలు చెప్పనవసరం లేదు ఎందుకంటే ,కోయబ్బరినూనె అనేది అందిరింట్లోనూ ఉంటుంది ,అయితే ఈ కొబ్బరినూనె ను ఒక చుక్క తీసుకొని మీ పెదాలకు మస్సాజ్ చేయండి,మంచి ఫలితాలను ఇస్తుంది .
ఆముదము
ఆముదము అనేది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నారు ,పచ్చగా ఉంది కొంచం ఒక రకమైన వాసన వస్తుంది ,కానీ పైన చెప్పిన విదంగా మీరు ప్రయతించినట్లయితే మీకు మంచి లాభం ఉంటుంది .
పసుపు మరియు నిమ్మరసం
పసుపు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను ,పసుపు అనేది చాల రకాల రోగాలను నిరూలించే శక్తి ని కలిగి ఉంటుంది,అయితే పసుపు తో పాటు నిమ్మరసాన్ని కూడా పైన చెప్పిన విదంగా ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి .
నువ్వుల నూనె
నువ్వుల నూనె కూడా మీ పెదవులకు పైన చెప్పిన విదంగా ఉపయోగించినట్లయితే మంచి ఫలితహమ్ ఉంటుంది .
పైన చెప్పిన చిట్కాలన్నీ మీ పెడవలకు మాత్రమే కాదు కాళ్ళ పగుళ్ళకు మరియు మీ శరీరం లోని కొన్ని మృదువైన భాగాలలో ఎక్కడైనా పొక్కిన కూడా ఇవి అన్నీ చాలా బాగా పని చేస్తాయి ,అలాగే చలికాలం లో ఈ పెదవులు పగలటం అనేది సర్వ సాదరణం ,ఎందుకంటే చలి వలన మనం శరీరంలో తేమ శాతం అనేది పడిపోతుంది . దీని కారణం గా మనకి పగుళ్లు అనేవి ఏర్పడతాయి,
మీకు పైన చెప్పిన చిట్కాలు బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను,మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు క్రిందన comment చేయగలరు ,మీ మెసేజ్ కోసం ఎదురుచూస్తుంటాను ,

0 Comments