'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టికెట్ ధరల పెంపు
హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరను అదనంగా రూ.125 పెంచుకునేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.100 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.
ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఆ రోజు మొత్తం ఆరు షోలు నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 23 వరకు అదనపు ధరలను వసూలు చేసుకునే అవకాశం ఇచ్చారు
.

0 Comments